Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : వికలాంగుల కోసం ప్రత్యేక నర్సింగ్ హౌమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు చైనా వెల్లడించింది. వికలాంగులకు, మానసిక వికలాంగులకు సేవలందించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. వికలాంగుల్లో మనో స్థైర్యాన్ని నింపేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. వచ్చే ఏడాది జనవరి1 నుంచి దేశ వ్యాప్తంగా నర్సింగ్ హౌమ్లు ప్రారంభించాలని అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. జిన్పింగ్ సర్కారు ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు చైనా డిజేబుల్డ్ పర్సన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఫెంగ్ షాన్వీ తెలిపారు.