Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎన్సీటీఏడీ ర్యాంకింగ్
బీజింగ్ : వాణిజ్య అభివృద్ధిలో చైనాలోని షాంఘై ఓడరేవు తొలిస్థానంలో నిలిచిందని యునైటెడ్ నేషనల్స్ కాన్ఫెరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్సీటీఏడీ) వెల్లడించింది. షాంఘై ఓడరేవు నుంచి వర్తక, వాణిజ్యాలు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపింది. యూఎన్సీటీఏడీ విడుదల చేసిన నివేదిక ప్రకారం...షాంఘే ఓడరేవుకు 134 పాయింట్లు, సింగపూర్ ఓడరేవుకు 124.7 పాయింట్లు, దక్షిణకొరియాలోని బుసాన్ ఓడరేవుకు 114.4, చైనాలోని నింగ్బో ఓడరేవుకు 114.3 పాయింట్లు వచ్చాయి. ఈవిషయాన్ని యూఎన్సీటీఏడీ డైరెక్టర్ షమికా శ్రీమన్నె తెలిపారు. టాప్20 ఓడరేవుల్లో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు చోటు దక్కలేదని అన్నారు.