Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో తుపాకుల సంస్కృతి నియంత్రణకు సంబంధించి నూతన చట్టాలను రూపొందించే అంశంపై వచ్చేనెలలో సెనెట్‌లో చర్చించనున్నట్టు సెనెటర్ మెక్కానెల్ తెలిపారు. అమెరికాలో రెండు వారాల్లో మూడు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 35 మంది మృతి చెందారు. 52 మంది గాయపడ్డారు. కాల్పుల మోతల ఘటనలతో అమెరికన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తుపాకులను విక్రయించే కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో దుండగుల ఆగడాలు శృతిమించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.