Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండ్ : నేపాల్లోని మనాంగ్ జిల్లాలో 'ఖాజిన్సారా' అనే సరస్సును కనుగొన్నట్టు 'ద హిమాలయన్ టైమ్స్' పేర్కొంది. చామే గ్రామీణ మునిసిపాలిటీలోని సింగార్ఖ అనే ప్రాంతంలో ఉందని, కొన్ని నెలల క్రితం కొందరు పర్వతారోహకులు గుర్తించినట్టు పేర్కొంది. హిమాలయాల్లో 4,919 మీటర్ల ఎత్తులో ఉన్న తిలిచో సరస్సు ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సుగా రికార్డులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొత్తగా గుర్తించిన ఈ సరస్సు ఈ రికార్డును తిరగరాయనుంది. అక్షాంశంపై 5,200 మీటర్ల ఎత్తులో ఉందని, 1,500 మీటర్ల పొడవు, ఆరువందల మీటర్ల వెడల్పులో ఉన్నట్టు చామే మునిసిపల్ అధికారులు గుర్తించారు. కాగా, తిలిచో సరస్సు అక్షాంశంపై 4,919 మీటర్ల ఎత్తులో 4 కిలోమీటర్ల పొడవు, 1.2 కిలోమీటర్ల వెడల్పు, 200 మీటర్ల లోతులో ఉంది.