Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక మీడియాలో నిరసనల వెల్లువ
లండన్: విద్యుత్ కోతతో లండన్, ఆగేయ, వాయువ్య ఇంగ్లాండ్, స్కాట్లాండ్లోని లక్షలాదిమంది ప్రజలు శుక్రవారం సాయంత్రం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ కోతతో పలు చోట్ల రైళ్ల, విమానాల రాకపోకలను నిలిపివేశారు. అదేవిధంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంగ్లాండ్‌లోని వేల్స్ నేషనల్ ఎలక్ట్రికల్ గ్రిడ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. ఈ సమస్యలతో లండన్‌లోని పలు రైళ్లను రద్దచేసినట్టు నేషనల్ రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా రోడ్లపై పల్లు చోట్ల టాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణీకులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. న్యూకాజిల్ విమానాశ్రయంలోని విమానాల రాకపోకలకు నిలిచిపోయాయి. అదేవిధంగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక మంది ప్రజలు ఇబ్బరదులు పడ్డారు. ఈ సమస్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రజలు వ్యంగంగా పోస్టులను పెట్టారు.