Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ప్రతిపాదన
సియోల్: జపాన్‌తో కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే దిశగా చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియా అధ్యక్షులు మూన్-జే-ఇన్ ప్రతిపాదించారు. గురువారం ఆయన అధికారిక మీడియాలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ వివాద పరిష్కారం కోసం జపాన్ కోరితే తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఉ.కొరియా ఇటీవల ప్రయోగించిన స్వల్పశ్రేణి క్షిపణుల వల్ల ముప్పుందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. కొరియా ద్వీపకల్పం అణు నిరాయుధీకరణపై ఉ.కొరియా, అమెరికా ప్రభుత్వాలు త్వరలోనే చర్చలు ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఒక దేశం తనకు ప్రయోజనం వున్న ఒక రంగాన్ని ఆయుధీకరణ చేస్తే శాంతియుతంగా కొనసాగే వాణిజ్య రంగం అనివార్యంగా గాడి తప్పుతుంది. ఇతరులు తన మార్గాన్ని అనుసరిస్తున్నపుడు ఆ దేశం ఆ మార్గాన్ని మూసివేయటం భావ్యం కాదు' అని జపాన్ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ద.కొరియాపై జపాన్ ఇటీవల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.