Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసీలియా :చైనాతో బ్రెజిల్‌కు బలమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయని బ్రెజిల్ విదేశాంగ శాఖ పేర్కొంది. బ్రెజిల్ ఆవిర్భవించి 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిలో వివరాల ప్రకారం...చైనా-బ్రెజిల్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లోనూ ఈ సత్సంబంధాలను కొనసాగిస్తాం. వర్తక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. 2009 నుంచి ఇరుదేశాల మధ్య శాస్త్ర, సాంకేతి రంగాల అభివృద్ధి కోసం సంబంధాలు మరింత బలపడ్డాయని తెలిపింది.