Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా :సిరియాలో తక్షణమే సేఫ్ జోన్ ఏర్పాటు చేయాలని టర్కీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో అమె రికా నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తోందని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లత్ కవుసోగ్లూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సిరియాలో సేఫ్ జోన్ ఏర్పాటు కోసం అమెరికా ప్రయత్నించాలని ఆయన డిమాండ్ చేశారు. యూఎస్ యూరోపియన్ కమాండ్ డిప్యూటీ కమాం డర్ స్టీఫెన్ ట్విట్టీ వచ్చేవారం సాన్లి వుర్ఫా ప్రావిన్స్‌లో పర్యటించనున్నారు. సేఫ్ జోన్ ఏర్పాటు బాధ్యతలను ఆయన కు అప్పగించారు. ఈ నేపథ్యంలో కవుసోగ్లూ పై వ్యాఖ్యలు చేశారు. ఈనెల7న అమెరికా, టర్కీ ప్రతినిధుల మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. సిరియాలో శాంతి స్థాపన అంశంపై సుదీర్ఘ చర్చ జరిపారు. సిరియాలో సేఫ్ జోన్ ఏర్పాటు కోసం ఇరుదేశాల ప్రతినిధులు అంగీకరించారు. సిరియా ఉత్తరభూభాగంలో ఈ జోన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.