Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 మంది మృతి : 10 మందికి గాయాలు
కీవ్ : ఉక్రెయిన్లోని ఒడెస్సా నగరంలో ఉన్న 'టోక్యో స్టార్ హోటల్'లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 10 మందికి గాయాలైనట్లు తెలిపింది. తెల్లవారు జామున 1.34 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని, దాదాపు 65 అగ్నిమాపక వాహనాలు, 13 అత్యవసర సేవల వాహనాలు మూడు గంటలపాటు శ్రమపడి మంటలను అదుపులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో దాదాపు150 మందిని ఈ ప్రాంతం నుండి తరలించినట్టు వారు వెల్లడించారు. టోక్యోస్టార్ హోటల్లో అగ్నిప్రమాద సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. నివారణా చర్యలను హోటల్ పాటించనందునే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.