Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో తుపాకుల విచ్చలవిడి వినియోగాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు కదం తొక్కారు. శాన్ఫ్రాన్సిస్కో వీధుల్లోకి చేరుకొని ట్రంప్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. అనంతరం శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని సిటీ హాల్ వరకు భారీ ర్యాలీ తీశారు. తుపాకులతో దాడులకు పాల్పడుతూ మారణహౌమం సృష్టిస్తున్న దుండగులను, ఉన్మాదులను మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.తుపాకుల సంస్కృతిని నిర్మూలించేందుకు యూఎస్ చట్టసభ సభ్యులు కృషి చేయాలని, చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు.