Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడుగురి మృతి
డమాస్కస్ : సిరియాలో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెం దిన ఏడుగురు మృతి చెందారు. తిరుగుబాటుదారుల ప్రాబల్య మున్న ఇద్లిబ్లో ఈ దాడి జరిగిందని సిరియాలో హక్కుల పర్యవేక్షణ సంస్థ పేర్కొంది. సిరియాలోని అనేక నగరాల్లో తిరుగుబాటుదారుల కార్యకలాపాలు తగ్గిపోయాయయని, ఇద్లిబ్లో మాత్రం రెబల్స్ దాడులు కొనసాగుతున్నాయని తెలిపింది. అయితే, తిరుగుబాటుదారుల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని సిరియా సైన్యమే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునని హక్కుల పర్యవేక్షణ సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. ఈదాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఏ సంస్థ కూడా ప్రకటించుకోలేదు.