Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో: రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌లో పేలకుండా ఉండిపోయిన రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును తాము కనుగొన్నట్టు భద్రతాధికారి లెఫ్టినెంట్ జనరల్ సెర్జీ ఖెలబ్నికోవ్ తెలిపారు. భవనంలో నిర్వహణ, మరమ్మతు పనులు కొనసాగుతున్న సమయంలో ఈ బాంబు బయటపడిందని, అది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిదని తేలిందని ఆయన మీడియాకు వివరించారు. ఈ బాంబుపై భారీగా మట్టి పేరుకు పోయి ఉన్నందున ఇది పేలకపోయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ బాంబును నిర్వీర్యం చేసినందుకు క్రెమ్లిన్ భద్రతకు ఎటువంటి ఢోకా లేదని ఆయన చెప్పారు.