Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చేనెల 16 నుంచి 21 వరకు...
మాస్కో : చైనా,భారత్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల సైన్యం రష్యాలో ఉమ్మడి విన్యాసాలు ప్రదర్శించనుంది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. వచ్చేనెల 16 నుంచి 21 వరకు ఆరు దేశాల సైన్యం నిర్వహించే ఉమ్మడి విన్యాసాల ప్రదర్శన కోసం ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిపింది. కాగా, ఉగ్రసంస్థల నిర్మూలనలో రష్యా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సిరియాలోని ఉగ్రశిబిరాలపై రష్యా బలగాలు వైమానిక దాడులకు పాల్పడి మిలిటెంట్ గ్రూపులను తరిమివేశాయి. రష్యా చొరవ కారణంగా సిరియాలోని ఉగ్రసంస్థల కార్యకలాపాలు తగ్గిపోయయి. ఉగ్రవాద నిర్మూలన కోసం ఉమ్మడి పోరుకు సిద్ధమైనట్టు చైనా,భారత్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు భరోసా ఇచ్చాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యాలో జరుగనున్న మిలిటరీ డ్రిల్స్‌లో 1.28లక్షల మంది సైనికులు పాల్గొనే అవకాశముందని పేర్కొంది. 20వేల ఆయుధాలను, 15 యుద్ధ నౌకలను, 600 యుద్ధవిమానాలను ప్రదర్శించనున్నట్టు తెలిపింది. 2008, 2011, 2015లో రష్యాలో పలుదేశాలకు చెందిన సైన్యం ఉమ్మడి సైనిక విన్యాసాలను ప్రదర్శించింది. 2015లో నికరాగ్వా, కజకిస్థాన్ దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించాయి. 95వేల మంది సైన్యం పాల్గొన్నారు. ఈ విన్యాసాల్లో 7వేల ఆయుధాలను, 170 యుద్ధ విమానాలను, 20 యుద్ధ నౌకలను ప్రదర్శించారు.