Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడి తొలగింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌ను విధుల నుంచి తప్పిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. బోల్టన్ ఇచ్చిన చాలా సలహాలను తాను తీవ్రంగా వ్యతిరేకించానని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. వైట్ హౌస్‌లో మీ సేవలు ఇక చాలని జాన్ బోల్టన్‌కు గత రాత్రే సూచించానని ట్రంప్ ట్వీట్ చేశారు. రాజీనామా చేయాలని జాన్ బోల్టన్‌కు చెప్పగా.. రాజీనామా లేఖను తనకు సమర్పించినట్టు ట్రంప్ స్పష్టం చేశారు. బోల్టన్ ఇన్నాళ్లుగా చేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ట్రంప్ ట్వీట్ చేశారు. వచ్చే వారం కొత్త జాతీయ భద్రతా సలహాదారు ఎవరనే విషయాన్ని వెల్లడిస్తానని ఆయన తెలిపారు.