Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్: ఎన్నికల తర్వాతే చైనాతో పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం కుదుర్చుం కుంటామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. 2020లో రానున్న అధ్యక్ష ఎన్నికల ముందు చైనాతో పాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదనీ, ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని వెల్లడించారు. ఆయన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో వైట్ హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో మీడియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు ట్రంప్ పై విధంగా స్పందించారు. చైనా తమ వ్యవసాయ ఉత్పత్తులను కొనడం ప్రారంభించిందనీ, గతవారంలో ఈ కొనుగోళ్లు పెద్ద మొత్తంలో జరిగాయని అన్నారు. కానీ తాము ఇంతకన్నా పెద్ద ఒప్పందం కోసం చూస్తున్నామని వెల్లడించారు.