Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధ్యక్షుడిని తొలగించాలని డిమాండ్
కైరో: ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫతా-అల్-సీసీని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ దేశరాజధాని కైరో సహా ప్రధాన నగరాల్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కైరోలోని ధర్నా ప్రాంగణమైన తహ్రీర్ స్క్వేర్ వద్ద వందలాది మంది సీసీకి వ్యతిరేకంగా ప్రదర్శణలు చేశారు. జనరల్ నుంచి అధ్యక్షుడిగా మారిన సీసీ పాలనలో వేలాది మంది ఇస్లాంవాదులు, లౌకిక కార్యకర్తలు, ఆందోళనకారులపై అణచివేత చర్యలు చేపట్టారని ఆరోపించారు. అంతేకాకుండా వారందరినీ అన్యాయంగా జైళ్లలో పెడుతున్నారని తెలిపారు. ఈ విధమైన చర్యలకు నిరసనగా సీసీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఈజిప్టియన్లు రోడ్లపైకి వచ్చారు. సీసీకి వ్యతిరేకంగా ట్విట్టర్లో 'తహ్రీర్ స్క్వేర్' అనే హాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. ఈ హాష్‌ట్యాగ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. ఈజిప్టు నుంచి బహిష్కరణకు గురై స్పెయిన్‌లో ఉంటున్న మహ్మద్ అలీ అనే ప్రముఖ వ్యాపారవేత్త.. సీసీపై అవినీతి ఆరోపణలు చేస్తూ సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. సీసీని పదవి నుంచి తొలగిం చాలని అలీ పిలుపునిచ్చారు. ఈ ఆరోపణలను సీసీ తీవ్రంగా ఖండించారు. ఓ సమావేశంలతో పాల్గొన్న ఆయన.. ఈజిప్షియన్లకు, మిలిటరీకి తాను విశ్వాస పాత్రుడని తెలిపారు. అయితే అక్కడి పోలీసులు స్వల్ప వ్యవధిలోనే నిరసనకారులను చెదరగొట్టారు. భాష్ప వాయువు ప్రయోగించారు. అంతేకాకుండా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, 2013లో ఇస్లామిక్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీని అప్పటి జనరల్‌గా ఉన్న సీసీ.. సైనిక బహిష్కరణ చేసిన తరువాత ఈజిప్టులో నిరసనలను నిషేధించిన విషయం తెలిసిందే. ఆరేండ్ల తర్వాత నిరసనలు జరగడం ఇదే మొదటిసారి.