Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు అనుమానితుల అరెస్ట్
పారిస్: పోలీస్ అధికారులను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈనెల3న మైఖెల్ హార్పన్ (45) అనే వ్యక్తి పోలీస్ హెడ్క్వార్టర్స్లోకి చొరబడి నలుగురు పోలీస్ అధికారులను హత్య చేశాడు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతను మృతి చెందాడు. హార్పన్తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిందితులకు ఐఎస్తో సంబంధాలున్నాయనే కోణంలో విచారణ చేపడుతున్నామని అన్నారు.