Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'హగిబిస్' తాకిడికి 36 మంది మృతి : అధికారుల ధ్రువీకరణ
టోక్యో : జపాన్లో హగిబిస్ తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాను తాకిడితో వేలాది ఎకరాల విస్తీర్ణంలో పంట పొలాలు నీటమునిగాయి. వేలాది ఇండ్లు వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయాయి. వరదల్లో చిక్కుకొని 36 మంది మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. మరో 16 మంది ఆచూకీ తెలియరాలేదని అన్నారు. భారీ ఆస్తినష్టం సంభవించిందన్నారు. తుఫాను ప్రభావం అధికంగా ఉన్న నగానో నగరంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. జపాన్ ప్రధాని షింజో అబె సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.