Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అట్వుడ్, ఎవరిస్టోలకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్
లండన్: ఈ ఏడాది ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్‌కు పోటీ పడిన రచయితల ఎంపికలో 'టై' ఏర్పడిన నేప థ్యంలో న్యాయనిర్ణేతల జ్యూరీ నిబంధనలను పక్కన పెట్టి మార్గరేట్ ఆట్వుడ్, బెర్నిం డిన్ ఎవరెస్టోలను సంయుక్త విజేతలుగా ప్రకటించింది. భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీ రచించిన 'క్విచోట్' నవలతో పాటు మరో ఐదు నవలలకు ఈ సాహితీ పురస్కారం లభించింది. బుకర్ ప్రైజ్ నిబంధనల ప్రకారం ఈ పురస్కారాన్ని విభజించటానికి వీలు లేకపోవటంతో తాము ఆట్వుడ్ రచించిన 'ది టెస్టామెంట్' పుస్తకాన్ని, ఎవరిస్టో రచన 'గర్ల్, వుమన్, అదర్' పుస్తకాన్ని విడదీసి చూడలేమని న్యాయనిర్ణేతలు స్పష్టం చేశారు. 1992లో ఏర్పడిన టై తరువాత నిర్వాహకులు ఈ నిబంధనల్లో మార్పు చేశారు.
అయితే తాము ఇరువురు రచయితలను వేర్వేరుగా ఎంపిక చేయ లేమన్న న్యాయమూర్తులు ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటించారు. 1969లో ప్రారంభించిన ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి నల్లజాతి మహిళ ఎవరెస్టోతో సంయుక్తంగా తనకు పురస్కారం లభించటం పట్ల 79 ఏండ్ల కెనడియన్ రచయిత్రి ఆట్వుడ్ సంతోషం వ్యక్తం చేశారు.