Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూలా డిసెల్వాను వెంటనే విడుదల చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, స్టడీ సెంటర్ల ద్వారా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల 28వ వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 27న లూలా 74 జన్మదినోత్సవం అన్న విషయం తెలిసిందే. లూలా డిసెల్వాను తక్షణమే విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్టు క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ కానెల్ ఒక ట్వీట్లో వివరించారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయిన తరువాత క్యూబన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ పీపుల్స్ ఆధ్వర్యంలో నవంబర్ 1 నుంచి 3 వరకు హవానాలో జరిగే సామ్రాజ్యవాద వ్యతిరేక సదస్సుకు హాజరయ్యే బ్రెజిలియన్ ప్రతినిధి వర్గానికి అందచేస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం బ్రెజిల్ జైలులో నిర్బంధంలో ఉన్న లూలా తన జైలు శిక్షపై సుప్రీంకోర్టు సమీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.