Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రంప్ లేఖను బుట్టదాఖలు చేసిన ఎర్డోగన్
- సిరియా సరిహద్దు నుంచి టర్కీ బలగాల ఉపసంహరణకు నిరాకరణ
అంకారా: సిరియా సరిహద్దులో మోహరిం చిన బలగాలను ఉపసంహరించుకోవా లని అభ్యర్థిస్తూ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ లేఖ రాశారు. అయితే, ఎర్డోగన్ ఈ లేఖను తెరవకుండానే చెత్తబుట్టలో విసిరివేస ినట్టు టర్కీ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. 'మీ నిర్ణయం కారణంగా వేలాది మంది సిరియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన దుస్థితి నెలకొంది. సిరియా సరిహద్దు నుంచి బలగాలను వెనక్కి పిలవండి. మేం చెప్పినట్టు చేసినట్టయితే మీతో ఒప్పందం కుదుర్చుకుందాం. లేదంటే, మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాల్సి వస్తుంది. మీ దేశంపై భారీ ఆంక్షలు విధించాల్సి వస్తుంది. నిర్ణయం మీ చేతుల్లో ఉన్నది' అని ఎర్డోగన్‌కు ట్రంప్ లేఖ పంపారు. అయితే, ఈ లేఖను ఎర్డోగన్ తెరచిచూడకుండానే చెత్తబుట్టలో పడేశారని, తమపై అమెరికా పెత్తనం చెలాయించాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అధ్యక్ష కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. సిరియాలో ఐఎస్ ఏరివేత కోసం అమెరికా సంకీర్ణదళాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో కుర్దు తిరుగుబాటుదారులు కీలక పాత్ర పోషించారు. అయితే, ఈనెల 9న సిరియా సరిహద్దు నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్టు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇదే అదనుగా భావించిన టర్కీ బలగాలు సిరియా సరిహద్దుకు చేరుకొని కుర్దు తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబులు జారవిడిచాయి. టర్కీ దాడుల్లో 71 మంది సిరియన్లు మృతిచెందినట్టు సిరియాలో మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ పేర్కొంది. సిరియా ఉత్తర సరిహద్దు నుంచి అమెరికా బలగాలు వైదొలగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ నిర్ణయంపై సిరియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యా, ఫ్రాన్స్, ఈయూ సభ్యదేశాలు సిరియా సరిహద్దులో టర్కీ నిర్వహిస్తున్న ప్రత్యేక ఆపరేషన్‌ను నిలిపివేయాలని కోరాయి.
కుర్దు తిరుగుబాటుదారులు ఐఎస్ కంటే ప్రమాదం : ట్రంప్
కుర్దు తిరుగుబాటుదారులు ఐఎస్ కంటే ప్రమాదకరమని ట్రంప్ ఆరోపించారు. ఐఎస్ నిర్మూలనలో కుర్దు తిరుగుబాటుదారులు తమకు సంపూర్ణసహకారం అందిస్తున్నారని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ప్రకటించిన ట్రంప్ తాజాగా మాట మార్చారు. తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించారు. కుర్దు తిరుగుబాటుదారులపై టర్కీ దాడులను పరోక్షంగా మద్దతిస్తున్నారనేది ట్రంప్ తాజా ప్రకటనతో తేటతెల్లమైంది. ఉత్తరసిరియాలో టర్కీ దాడులను ఆపాలని ఓ పక్క చెబుతూనే మరోపక్క కుర్దు తిరుగుబాటుదారుల పట్ల ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. కుర్దు తిరుగుబాటుదారుల అణచివేత కోసమే సంకీర్ణదళాలను ఉత్తరసిరియా సరిహద్దు నుంచి ట్రంప్ వెనక్కి పిలిపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి .