Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్లో వెనెజులాకు చోటు దక్కింది. 47 మంది సభ్యులతో కూడిన ఈ కౌన్సిల్ జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కౌన్సిల్లో 14 సభ్య దేశాల మూడేండ్ల కాలపరిమితి ముగియటంతో, ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో తాజాగా ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో వెనెజులా సభ్యత్వానికి భారీ ఎత్తున మద్దతు లభించింది. ముఖ్యంగా రష్యా, చైనా దేశాల నుంచి గట్టి మద్దతు దక్కింది. మరో లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్ కూడా కౌన్సిల్‌కు ఎంపికైంది. వెనెజులాకు 105 ఓట్లు, బ్రెజిల్‌కు 153 ఓట్లు వచ్చాయి. లాటిన్ అమెరికా నుంచి పోటీ పడిన మరో దేశం కోస్టారీకా 96 ఓట్లతో కౌన్సిల్లో చోటు దక్కించు కోలేకపోయింది. సభ్యదేశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తాయి.