Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టర్కీ : ఉత్తర సిరియా సరిహద్దు నుంచి తమ సభ్యులను వెనక్కి పిలవనున్నట్టు కుర్దు తిరుగుబాటుదారుల ప్రతినిధి రెదుర్ ఖలీల్ వెల్లడించారు. అయితే, ఉత్తర సిరియా సరిహద్దు నుంచి టర్కీ బలగాలు వైదొలగి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టయితే తాము కూడా వైదొలగుతామని ఆయన స్పష్టం చేశారు. ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోందని అన్నారు. ఒప్పందం ప్రకారం రసల్ఐన్ నగరాన్ని తాము ఖాళీ చేశామని అన్నారు. కాగా, ఉత్తర సిరియా సరిహద్దులో కాల్పుల ఉల్లంఘన ఘటనలు చోటు చేసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఐదురోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అంగీకరించారు.