Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుద్ధనేరాలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడ్డ టగాండ
ది హేగ్ : కాంగో రెబల్ నేత టగాండ(46)కు 30 ఏండ్ల జైలు శిక్ష విధించినట్టు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. టగాండపై పోలీసులు నమోదు చేసిన అభియోగాలన్నీ న్యాయస్థానంలో రుజువయ్యాయి. యుద్ధ నేరాలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినట్టు విచారణలో టగాండ అంగీకరించారు. కాంగోలోని ఇటూరీ ప్రాంతంలో 2002 నుంచి 2003 మధ్య కాలంలో నరమేధం సృష్టించినట్టు తాను తెలిపాడు. 13సార్లు యుద్ధ నేరాలకు పాల్పడ్డాడు. కాగా, 1999లో ఇటూరీ నగరంలో హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. ఇక్కడ చెలరేగిన అల్లర్లలో 60 వేల మృతి చెందారు. ఇదే క్రమంలో టగాండ డ్రగ్స్ మాఫియాగా ఎదిగాడు. ఇక్కడి ప్రజల్లో భయాందోళనలు సృష్టించాడు. తనకంటూ ఓ గ్రూపును ఏర్పాటు చేసుకొని నరమేథం సృష్టించాడు. మైనర్ బాలికలను అపహరించి బానిసలుగా మల్చుకున్నాడు. వీరిపై లైంగిక దాడులకు పాల్పడి భయబ్రాంతులకు గురిచేసి హత్యలకు పాల్పడ్డాడు. టగాండకు 30 ఏండ్ల శిక్ష విధిస్తున్నట్టు అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బాధిత కుటుంబాలు స్వాగతించాయి.