Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి గట్టి పోటీ ఇస్తానంటూ లేబర్‌పార్టీ యువనేత ధీమా
- వచ్చేనెల 12న బ్రిటన్‌లో ఎన్నికలు
- జాన్సన్‌తో తలపడేందుకు సిద్ధమైన 25 ఏండ్ల ముస్లిం వలసదారుడు
లండన్ : ఇరాన్ నుంచి లండన్ నగరానికి వచ్చి స్థిరపడిన ఓ ముస్లిం యువకుడు బ్రిటన్ ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నేత బోరిస్ జాన్సన్‌పై పోటీకి సిద్ధమయ్యాడు. అది కూడా లేబర్ పార్టీ కార్యకర్తలు అధికంగా ఉన్న ఆక్స్బ్రిడ్జ్ నగరం నుంచి పోటీచేయనున్నట్టు తెలిపాడు. అలీ మిలానీ చేసిన తాజా ప్రకటనతో జాన్సన్ మదిలో గుబులు మొదలైంది. బ్రెగ్జిట్ నేపథ్యంలో వచ్చేనెల 12న బ్రిటన్‌లో ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఈఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని జాన్సన్ భావిస్తున్నారు. అయితే, ఆయన పోటీ చేయనున్న ఆక్స్బ్రిడ్జ్ ప్రాంతం నుంచి యువనేతను బరిలోకి దించాలని లేబర్‌పార్టీ నిర్ణయించుకుంది. తద్వారా జాన్సన్‌ను ఇరకాటంలోకి నెట్టాలని వ్యూహరచన చేసింది. బుధవారం నుంచి జాన్సన్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. గురువారం రోజున లేబర్‌పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. లేబర్‌పార్టీ నుంచి పోటీ చేయనున్న అలీ మిలానీకి విశేష ప్రజాధరణ ఉంది. విద్యార్థి సంఘం నాయకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. మిలానీ ఐదేండ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి ఇరాన్ నుంచి లండన్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. ఉపకార వేతనాల సాయంతో మిలానీ విద్యాభ్యాసం కొనసాగింది. బ్రునెల్ వర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నారు. స్థానిక నేతగా ఎదిగారు. గురువారం ప్రచారం ప్రారంభించిన మిలానీ ప్రతీ ఇంటికి వెళ్లి లేబర్‌పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో జాన్సన్‌ను ఓడించాలని ఓటర్లను అభ్యర్థించారు.