Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుంకాల రద్దుకు అమెరికా-చైనా దేశాల మధ్య కుదిరిన అంగీకారం
బీజింగ్: చైనా- అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తు న్నాయి. ఈ మేరకు ఆ రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని నెలలుగా ఇరు దేశాలూ ఒకరి ఉత్పత్తులపై మరొకరు విధిస్తూ వచ్చిన సుంకాలను రద్దు చేసేందుకు అంగీకరించినట్టు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. 'గత రెండు వారాలుగా ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య వ్యక్తమైన ఆందోళనలపై చర్చించడమే కాకుండా అదనంగా విధించిన సుంకాలను దశలవారీగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. తుది ఒప్పందం దిశగా అడుగులు వేశారు' అని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ తెలిపారు. ఫేజ్-1 ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల సమాన నిష్పత్తిలో ఒకేసారి గతంలో విధించిన సుంకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు గావో తెలిపారు. ఒప్పందం చేరు కోవడానికి ఇదే ప్రధానమైన షరతు అని ఆయన తెలిపారు.. 'సుంకాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. వాటి రద్దు చేయడంతోనే వాణిజ్య యుద్ధం పూర్తవుతుంది' అని గావో తెలిపారు. అయితే, ఇందుకు ఎంత గడువు నిర్దేశించుకున్నదీ వెల్లడిం చలేదు. ఇరు దేశాల ఏడాదికి పైగా రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వందల బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై రెండు దేశాలు ఒకదానిపై ఒకటి భారీ స్థాయిలో సుంకాలు విధించుకున్నాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలు ఒప్పందంతో ఈ వాణిజ్య యుద్ధానికి తెరదించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాధినేతలు త్వరలోనే ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది.