Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏథెన్స్ : గ్రీస్ రాజధాని ఏథెన్స్లోని పురాతన ఆర్కోపాలిస్ వస్తు ప్రదర్శనశాలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భార్య పెంగ్లియాన్.. గ్రీస్ అధ్యక్షుడు ప్రొకోపిస్ పవ్లోపోలస్, భార్య వ్లాసియా పవ్లోపోలస్ పెల్సేమీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్కోపాలిస్ మ్యూజియంలో పనిచేస్తున్న ఉద్యోగులతో జిన్‌పింగ్ కాసేపు ముచ్చటించారు. చైనా, గ్రీస్ దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని జిన్‌పింగ్ అన్నారు.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన గ్రీస్‌ను చైనా ఆదుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్‌లోనూ గ్రీస్‌కు అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం పిరస్ పోర్టును సందర్శించారు. ఈ ఓడరేవు నిర్మాణం ద్వారా 10వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు పవ్లోపోలస్ తెలిపారు. చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును అతి త్వరలో పూర్తి చేయనున్నట్టు జిన్‌పింగ్ తెలిపారు.