Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : హాంకాంగ్ నిరసనకారులు లండన్ నగరంలో రెచ్చిపోయారు. హాంకాంగ్ న్యాయ శాఖ మంత్రి తెరెసా చెంగ్‌ని కొట్టి ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. చార్టర్డ్ ఇనిస్టిట్యూట్ కార్యాలయం వద్ద తన కారు దిగుతున్న ఆమెను చూసిన ఆందోళనకారులు దూసుకువచ్చి దాడికి పాల్పడ్డారు. మూకుమ్మడిగా ఆమెను చుట్టుముట్టి నెట్టివేయడంతో ఆమె కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన తెరెసాను పోలీసులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. హాంకాంగ్‌లో కొన్ని వివాదాలను పరిష్కరించడంలో సఫ లీకృతురాలైన ఆమె దానికి సంబంధించి ప్రసంగించేందుకు లండన్ వచ్చారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన అల్లర్లలో పలు వురు మృతిచెందగా, సుమారు వెయ్యిమందికి పైగా గాయ పడ్డారు. మొదట నేరస్థుల అప్పగింత బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి భారీ ప్రదర్శనలకు పూనుకోవడం ఉద్యమానికే దారి తీసింది. ఈ బిల్లుపై ప్రభుత్వం వెనక్కు తగ్గినప్పటికీ.. దీన్ని పూర్తిగా ఉపసంహరించాలంటూ వారు పార్లమెంట్ ముట్టడికి సైతం సిధ్దపడ్డారు. చివరకు లండన్‌లోనూ నిరసనకారులు రెచ్చిపోయారు. లండన్‌లో ఓ మహిళా మంత్రిపై దాడి జరగడం ఇదే మొదటిసారి.