Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురి మృతి
వాషింగ్టన్ : అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరో ఐదుగురు బలైపోయారు. కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. శాన్ డియాగో నగరంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులపై కాల్పులకు తెగబడ్డా డని, ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారని వివరించిం ది. కాల్పులకు పాల్పడ్డ నిందితునికి 31 ఏండ్లు ఉంటాయని, తన మాజీ భార్యతో విభేదాల కారణంగా ఈ ఘటనకు పాల్పడ్డాడని అక్కడి మీడియా తెలిపింది. ఈ కాల్పుల్లో అతడి మాజీ భార్యతో పాటు 9 ఏండ్ల లోపు ఉన్న ముగ్గురు కుమారులు మృతి చెందారని పేర్కొంది. అనంతరం తాను కూడా కాల్చుకొని ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. ఈ కాల్పుల్లో 11 ఏండ్ల మరో బాలుడు గాయపడ్డాడని, అతడికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపింది.