Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు కార్లు, ఓ భవనం ధ్వంసం
స్టాక్హౌమ్: స్వీడన్లోని సెంట్రల్ స్టాక్హౌమ్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలు కార్లు, ఓ భవనం ధ్వంసమైంది. పేలుడు సంభవించిన సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడు ఘటనతో పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. స్థానికులు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. కొందరు దుండగులు భవనాన్ని పేల్చేసినట్టు పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు. ఇదిలా ఉండగా, స్వీడన్లో పేలుడు ఘటనలు తరుచుగా సంభవిస్తుంటాయి. ఇక్కడి భద్రతా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. గతేడాది జనవరి నుంచి నవంబర్ వరకు స్వీడన్లో 236 పేలుడు ఘటనలు సంభవించాయని స్వీడిష్ నేషనల్ కౌన్సిల్ ఫర్ క్రైమ్ ప్రివెన్షెన్ పేర్కొంది.