Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యవర్తిత్వం బాధ్యతలు తీసుకోనున్నట్టు మూన్ ప్రకటన
సియోల్ : అమెరికాతో చర్చ లకు ఉత్తరకొరియా సుముఖంగా ఉన్నదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్జే ఇన్ అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వం బాధ్యతలను తాను తీసుకోనున్నట్టు వెల్ల డించారు. ఇరుదేశాల మధ్య అణ్వస్త్ర పరీక్షల నిర్మూలన అంశంపై చర్చలు జరిగినట్టయితే కొరియా ద్వీపకల్పంలో శాంతిస్థాపనకు మార్గం సుగమం అవుతుందన్నారు. గతంలో ఇరుదేశాధినేతల మధ్య జరిగిన చర్చలు ఒప్పందం లేకుండా ముగిశాయని అన్నారు. ఉత్తరకొరియాపై అగ్రరాజ్యం మోపిన ఆంక్షలను ఎత్తివేసేందుకు నిరాకరించడంతోనే చర్చల్లో పురోగతి కన్పించలేదని అన్నారు. అయితే, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ జన్మదినం సందర్భంగా ట్రంప్ సందేశం పంపారు. ఈ సందేశంపై కిమ్ హర్షం వక్తం చేసినట్టు ఉత్తర కొరియా మీడియా సంస్థలు ప్రకటించాయని అన్నారు. అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగా కిమ్ సంకేతాలిచ్చారని మూన్ తెలిపారు. తద్వారా, అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య అర్థాంతంగా నిలిచిపోయిన చర్చలు పునరుద్ధరించే అవకాశం లభించిందని అన్నారు. ఈ చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని మూన్ తెలిపారు.