Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిచేయడానికి కృషి చేస్తున్న సంస్థ
న్యూయార్క్: ఇప్పటికే పలు సమస్యలతో గ్రౌండ్‌కు పరిమితమైన బోయింగ్ 737 మ్యాక్స్‌లో మరో కొత్త లోపాన్ని గుర్తించినట్టు సంస్థ ప్రకటించింది. అయితే దీన్ని వీలైనంత త్వరగా సరిచేయడానికి కృషి చేస్తామని వెల్లడించింది. తాజా సమస్య వల్ల.. విమానాలను తిరిగి సేవల్లో చేర్చాలని నిర్దేశించుకున్న తేదీపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన తాజా లోపం, దాన్ని సవరించడానికి తీసుకుంటున్న చర్యలపై ఫెడరల్ ఏవియేషన్‌కు వివరాలు అందజేశామని పేర్కొంది. ప్రయాణికులకు సురక్షితమైన సేవలందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపింది. విమానాన్ని అదుపు చేసే సాఫ్ట్వేర్, సిమ్యులేటర్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిచేసేందుకు ఇప్పటికే బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను సేవల నుంచి ఉపసం హరించుకున్న విషయం తెలిసిందే. గతంలో ఈ రకానికి చెందిన రెండు విమానాలు భారీ ప్రమాదా నికి గురికావడంతో బోయింగ్ వీటిని నిలిపివే యాలని నిర్ణయించింది. అప్పటి నుంచి లోపాల్ని సవరించేందుకు ఆసంస్థ కృషి చేస్తున్నది.