Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒట్టవా: కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో బల్క్లీ నది, బర్న్స్, బ్రొమన్, ఫ్రాన్సొయిస్ సరస్సుల వెంట నివసించే ఆదివాసీ తెగలకు చెందిన వెట్సూవెటెన్ల ప్రాంతంపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్లు (ఆర్సీఎంపీ) ఆంక్షలు విధించారు. తమ సంస్కృతీసాంప్రదాయాలకు నిలయమైన ప్రాంతంగుండా గ్యాస్లింక్ ఆయిల్ పైప్లైన్ వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెట్సూవెటెన్లు దశాబ్దకాలనికిపైగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
పైప్లైన్ నిర్మాణంతో అక్కడి వాతావరణం దెబ్బతినడమేకాకుండా, పైపులలో నుంచి చమురు లీకవ్వడం ద్వారా, స్థానిక పవిత్ర స్థలాలు, కళాఖండాలు అపవిత్రమవుతాయని వారు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. కానీ, వారి మనోభావాలు పట్టని బ్రిటిష్ కొలంబియా సర్కారు మాత్రం పైప్లైన్ నిర్మించడానికే మక్కువ చూపుతున్నది. తమ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం హామినివ్వాలని వారు కోరుతున్నారు. కాగా, ఆందోళనకారుల శిబిరాలపై ఆర్సీఎంపీలు ఏడాది క్రితం దాడి చేశారు. ఈ దాడి అనంతరం తాజాగా ఆంక్షలు విధించడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.