Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాగ్దాద్ : ఇరాక్‌లో ఐఎస్ ఉగ్రసంస్థకు చెందిన మిలిటెంట్ అరెస్ట్ అయ్యాడు. ఆయ న బరువు 250 కిలోలు. ఓ ఇంట్లో తలదాచుకున్నట్టు అంది న విశ్వసనీయ సమాచా రం మేరకు ఇరాక్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే, ఆయన్ను కారులో ఎక్కించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక చేసేది లేక ఓ పికప్ ట్రక్కును తీసుకొచ్చి జైలుకు తర లించారు. అక్కడి పోలీసుల వివరాల ప్రకారం.. ముఫ్తీ అబు అబ్దుల్ బారీ అనే ఐఎస్ సభ్యుడు విద్వేష ప్రసం గాలు ఇవ్వడంలో దిట్ట. యువతను ఐఎస్ సాను భూతిపరులుగా మార్చ డంలో కీలక పాత్ర పోషి స్తున్నాడు. ఐఎస్‌లో చేరిన తర్వాత కాలంలో వ్యతిరేకంగా మారిన వారిని చంపేయాలని అబు 'ఫత్వా'లు కూడా జారీ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఆయన్ను 'జబ్బా ది జిహాదీ'గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.