Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మృతి
బ్రసీలియా: ఆగేయ బ్రెజిల్ దక్షిణాది రాష్ట్రమైన ఎస్పిరిటో శాంటోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరదల్లో చిక్కుకొని ఆరుగురు మృతిచెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. మరికొందరు గల్లంతయ్యారని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఐకానాÛ మరియు అల్ఫ్రెడో చావెస్ నగరాల్లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వరదలకు పలు ప్రాంతాల్లోని భవనాలు, వ్యాపార సముదాయాలు నీటమునిగాయి. పలు వీధులు బురదమయ్యాయి. వరదలు ఉధృతమైన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. స్థానిక అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.