Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాక్‌లో ఆందోళనకారులపై విరుచుకుపడ్డ బలగాలు
- పలువురికి తీవ్ర గాయాలు
బాగ్దాద్: ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేక విధా నాలపై నిరసనకారులు గళమెత్తారు. సోమవారం బాగ్దాద్ నగర వీధుల్లోకి వేలాదిగా తరలివచ్చారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. రోడ్లపై టైర్లు దహనం చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. భద్రతా బలగాలు నిరసనకారులపై విరుచుకుపడ్డాయి. లాఠీలు ఝళిపించాయి. బాష్పవాయుగోళాలు ప్రయోగిం చాయి. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఇరాక్‌లో గతేడాది అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాక్‌లో అవినీతి బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ అధికారులు ముడుపులకు అలవాటు పడుతుండటంతో పాలన స్తంభించింది. ప్రజలకు ప్రభుత్వంపై అపనమ్మకం ఏర్పడింది. దీంతో, ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. యువతకు ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఇరాక్‌లోని అన్ని సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నిరసన కారులు డిమాండ్ చేశారు. ఇరాక్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని పూర్తిగా అరికట్టాలని కోరారు. ఇరాక్‌లో ప్రజాందోళనలు ఉధృతమైన నేపథ్యంలో ప్రధాని అబ్దెల్ అబ్దుల్ మహ్దీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మరో ప్రధానిని ఎన్నుకునేం దుకు అధ్యక్షుడు ప్రయత్నిస్తు న్నారు. అయితే, ఆయన ఒక్కరినే కాకుండా ప్రధాని క్యాబినేట్లోని మంత్రులందరినీ కూడా పదవుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాక్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అవినీతి మంత్రుల స్థానంలో కొత్త మంత్రులను నియమించాలని కోరారు.