Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియాద్ : వాట్సప్ మెసేజ్ ద్వారా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ వాషింగ్టన్‌లోని సౌదీ ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ ట్విట్టర్ ద్వారా అధికారులు స్పందించారు. బెజోస్ ఫోన్ హ్యాక్‌కు గురైందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. బెజోస్ ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహ్మద్ బిన్ సల్మాన్‌కు బెజోస్ ఫోన్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఏముంటదని తెలిపారు. కాగా, 2018లో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నుంచి ఓ వాట్సాప్ మెసేజ్ రిసీవ్ చేసుకున్న అనంతరం జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని వాషింగ్టన్పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. మహ్మద్ బిన్ సల్మాన్ వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్ నుంచి వైరస్‌తో కూడిన వీడియో ఫైల్‌ను పంపడం ద్వారా 2018 నుంచి అమెజాన్ చీఫ్ ఫోన్‌కు సంబంధించిన డేటా తస్కరణకు గురైందని ఆ కథనంలో పేర్కొంది.