Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యం, నివాసం నినాదంతో 37 స్థానాలు గెలుచుకున్న 'సిన్ ఫెయిన్' పార్టీ
- పాపులర్ ఓట్లో మొదటిస్థానంలో నిలిచిన మేరీలో మెక్డోనాల్డ్
డబ్లిన్ : ఐర్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్ష వాదులతో కూడిన 'సిన్ ఫెయిన్' పార్టీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ 37 స్థానాల్ని కైవసం చేసుకుంది. మొదటి ప్రాధాన్యత (పాపులర్) ఓట్లలో 'సిన్ ఫెయిన్' పార్టీ నాయకురాలు మేరీలో మెక్ డోనాల్డ్కు మిగతా పార్టీల నాయకులకన్నా అత్యధికశాతం (26.5శాతం) ఓట్లను పొందటం సంచలనంగా మారింది. అందరికీ ఆరోగ్యం, నివాసం..అనే నినాదంతో మేరిలో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఐర్లాండ్లో తీవ్రరూపం దాల్చిన ఆర్థిక అసమానతలు ఈ ఎన్నికల్ని గణనీయంగా ప్రభావితం చేశాయని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జాతీయాదయంలో 22శాతం వాటాను అట్టడుగున ఉన్న 40శాతం ప్రజలు కలిగివుండగా, 10శాతం ఉన్నతవర్గాల చేతిలో 25శాతం జాతీయాదాయం ఉంది. ఇప్పటివరకూ పాలించిన ఫియాన్నా ఫియాల్, ఫైన్ గాయెల్ పార్టీలను ప్రజలు తిరస్కరించారనే చెప్పాలి. ఈ పార్టీలు సాగించిన పాలన వల్ల ఎలాంటి ఆరోగ్య భద్రత, ఇండ్ల విషయాలను పయోజనాలు పొందలేదని సర్వేలో 63శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈఎన్నికల్లో ప్రజలు వామపక్ష భావజాలంతో కూడిన 'సిన్ ఫెయిన్' వైపు మొగ్గుచూపటం స్పష్టంగా కనపడింది.సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. గ్రీన్ పార్టీని కలుపుకొని సిన్ ఫెయిన్, ఫైన్ గాయెల్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని సమాచారం!
ప్రజలు విసిగిపోయారు : సిన్ ఫెయిన్
ఐర్లాండ్లో దశబ్దాలుగా అధికారమంతా రెండు పెద్ద పార్టీలైన ఫియాన్నా ఫియాల్, ఫైన్ గాయెల్ చేతుల్లోనే ఉండిపోయింది. నయా ఉదారవాద విధానాలతో పాలన సాగించిన ఈ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారు. కాబట్టే ఈ ఎన్నికల్లో మార్పును కోరుకున్నారు. అన్ని స్థానాల్లోగనుక పోటీచేసి ఉంటే మా సంఖ్య మరింత పెరిగి ఉండేది.
(26. 26.5శాతం
ఓట్లను పొందటం సంచలనం
ఐర్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ దక్కలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 80 స్థానాల్లో గెలుపొందాల్సి ఉండగా, ఫియాన్నా ఫియాల్ పార్టీకి 38 (స్పీకర్ ఓటుతో కలుపుకొని) , సిన్ ఫెయిన్ పార్టీకి 37, ఫైన్ గాయెల్ పార్టీకి 35 స్థానాలు గెలుచుకున్నాయి. గ్రీన్ పార్టీకి 12, లేబర్ పార్టీకి 6, సోషల్ డెమొక్రాట్స్కు 6, ఇతరులకు 21 స్థానాలు వచ్చాయి.