Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 మంది మృతి
లండన్ : బ్రిటన్ను తుఫాన్ 'డెన్నిస్' వణికిస్తున్నది. లండన్ నగరంలో వరదలు పోటెత్తాయి. దీంతో, బ్రిటిషర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. దక్షిణవేల్స్లోని అబెర్డరన్ ప్రాంతంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకొని 8 మంది మృతిచెందారు. టాఫ్ నది ఉధృతి పెరగడంతో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల మట్టమయ్యాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో 60వేల మంది ఇబ్బందిపడుతున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. తుఫాను కారణంగా పలు రైళ్లను రద్దు చేసుకున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యం కూడా రంగంలోకి దిగిడెన్నిస్ ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల అనేక ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్అలర్ట్ జారీ చేసింది.