Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: భారత దేశంతో పాటు ప్రపంచం లోని వివిధ దేశాలకు చెందిన నైపుణ్యమున్న వారిని ఆకర్షించేందుకుగాను బ్రిటన్ ప్రభుత్వం కొత్తగా పాయింట్స్ బేసిడ్ వీసా విధానానికి శ్రీకారం చుట్టింది. తక్కువ నైపుణ్యం ఉన్న కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్టు బ్రిటన్ హౌంశాఖ మంత్రి ప్రీతి పటేల్ ప్రకటించారు. గత నెలలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగిన సంగతి తెలిసిందే. తద్వారా , 2021 జనవరి 1 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుంది.
ఈయూ, భారత్, యూరోపియన్ యూని యనేతర దేశాలకు సమానంగా వర్తించే కొత్త పోస్ట్ బ్రెగ్జిట్ విధానంలో నిర్ధిష్ట నైపుణ్యాలు, అరÛ్హతలు, జీతాలు, ఉద్యోగాలకు పాయింట్లను కేటాయిస్తారు. తగినంత పాయింట్లు సాధించినవారికి మాత్రమే వీసాలు మంజూరు చేయనున్నారు.
చౌకగా లభించే వలస కార్మికులపై దేశం ఆధారపడటాన్ని అంతం చేయడానికి, కఠినమైన భద్రతతో మొత్తం వలసల స్థాయిని తగ్గించడానికి బ్రెగ్జిట్ అంశంపై 2016లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
ఈ కొత్త సింగిల్ గ్లోబల్ సిస్టమ్ ఈయూ, ఈయూ యేతర పౌరులను సమానంగా చూస్తుంది.శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, విద్యావేత్తలతో సహా అత్యున్నత నైపుణ్యాలు, ప్రతిభ వున్న వారికి ఈ విధానం అధిక ప్రాధాన్యత ఇస్తుందని హోంశాఖ కార్యాలయం తెలిపింది.
కాగా, గ్లోబల్ టాలెంట్ స్కీమ్ శుక్రవారం నుంచి అమలులోకి రానున్న ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం. ఇది 2021 నుంచి ఈయూ పౌరులకు కూడా వర్తించనుంది. అధిక నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఎలాంటి ఉపాధి అవకాశం లేకుండా బ్రిటన్లో అడుగుపెట్టేందుకు వీలు కల్పిస్తుంది.
ఇక పాయింట్ బేస్డ్ వీసా సిస్టమ్ విషయానికి వస్తే నైపుణ్యం కలిగిన కార్మికులు బ్రిటన్లో పనిచేయగలిగేలా నిర్ధిష్ట నైపుణ్యాలు, ఇంగ్లీష్ మాట్లాడే సామర్ద్యంతో సహా అనేక సంబంధిత ప్రమాణాలను కలిగి ఉండాలి. మైగ్రేషన్ అడ్వయిజరీ కమిటీ సిఫారసులకు అనుగుణంగా, కనీస వేతన పరిమితి 25,600 పౌండ్లు ఉండాలి.
డిసెంబర్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన విధంగా తక్కువ నైపుణ్యం కలిగిన వారికి యూకేలో ప్రవేశం ఉండదు.ప్రస్తుతం ఈయూలో ఉన్న శ్రామికశక్తిలో 70 శాతం మంది నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరాలను తీర్చ లేరని అంచనా. స్టూడెంట్ వీసాలను కూడా పాయింట్ల ఆధారిత వ్యవస్థ కిందకు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.యూకేలో చదువుకోవాల నుకునే వారు తమకు ఇష్టమైన విద్యా సంస్థ నుంచి ఆఫర్ లెటర్, విద్యను అభ్యసించగల ఆర్ధిక స్తోమతతోపాటు ఆంగ్లంలో మాట్లాడగలమని నిరూపించుకోవాల్సి ఉంటుంది.