Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాత్యహంకార భావాలు ప్రదర్శించిన అమెరికా ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్‌లో జాత్యహంకార భావాలు పెరిగిపోయాయి. సిక్కులపై, ముస్లిం మైనారిటీలపై దాడులు పెరిగాయి. నల్లజాతీయుల పట్ల అమెరికన్లలో చులకన భావం పెరిగింది. వలసదారులపై దాడులు అధికమయ్యాయి. జాతివిద్వేష భావాలను స్కూల్ స్థాయి నుంచి విద్యార్థుల్లో అలవర్చాలని పలు పాఠశాలలు విషం చిమ్ముతున్నాయి. అమెరికాలోని ఓ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్రికన్ల మనోభావాలను దెబ్బతీసింది. ఈ దుశ్చర్య కారణంగా ఆఫ్రికన్లకు బహిరంగ క్షమాపణలు తెలిపింది. ఇతర జాతులను కించపరిచే విధంగా ఇకపై ప్రవర్తించమని తెలిపింది. వివరాల్లోకి వెళితే..న్యూయార్క్ నగరంలో ఫ్యాషన్ రంగంలో శిక్షణ ఇచ్చే ఓ ఇనిస్టిట్యూట్ జాత్యహంకార భావాలను ప్రదర్శించింది. ఫ్యాషన్ షోలో పాల్గొన్న విద్యార్థినులను పెద్దసైజులో చెవులు, దొడ్డుగా కనిపించేలా పెదాలు, దట్టమైన కనుబొమ్మలను తయారుచేసుకొని ప్రదర్శించాలని సూచించింది. విద్యార్థినుల వేశధారణ ఆఫ్రికన్లను పోలి ఉండాలని తెలిపింది. ఈ షోలో పాల్గొన్న పలువురు విద్యార్థినులు ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆఫ్రికన్లను కించపరిచే విధంగా ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ యాజమాన్యం ప్రవర్తించిందని, తమ వేషధారణ ప్రదర్శించే సమయంలో బిగ్గరగా పరిహాసం చేశారని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. అంతేగాకుండా, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ తీరుపై విమర్శలు కురిపించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో ఆ సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో, తాము చేసిన పనికి క్షమించాలని ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ ప్రెసిడెంట్ జోయిస్ బ్రౌన్, చైర్మెన్ జొనాథన్ కిల్ ఫార్మర్ ఆఫ్రికన్లను కోరారు.