Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో: సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్‌లో సిరియా ప్రభుత్వ దళాలకు, తిరుగుబాటు గ్రూపులకు మధ్య దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. టర్కీ సైనిక చర్యతో అక్కడి పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. సిరియాలో పరిస్థితులు మెరుగుపడే వరకు తమ సేనలు అక్కడి నుంచి కదల బోవని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డీమిత్రి పెక్సోవ్ చెప్పారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. ఇద్లిబ్‌లో టర్కీ సాయుధ దళాలు సైనిక చర్యకు దిగితే రష్యా స్పందన ఏమిటన్న ప్రశ్నకు జవాబుగా ఈ వ్యాఖ్యలు చేశారు.
సిరియా సైన్యా నికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ సైనిక చర్య సిరియాలో పరిస్థితులను మరింత దిగజారుస్తుందని ఆయన హెచ్చరించారు. ఇద్లిబ్ ఇడ్లిబ్‌లో ఉద్రిక్తతలు పెరగ కుండా నివారిం చటానికి తాము టర్కీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.