Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాదుల చేతుల్లో చిన్నపాటి ఆయుధాలు
- ఐరాస తీవ్రవాద నిరోధక విభాగం చీఫ్ వ్లాదిమిర్ వొరోంకోవ్
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు వినియోగిస్తున్న ఆయుధాలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక తీవ్రవాద సంస్థలు చౌకగా దొరికే చిన్నపాటి మారణాయుధాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఐరాస తీవ్రవాద నిరోధక విభాగం చీఫ్ వ్లాదిమిర్ వొరోంకోవ్ పేర్కొన్నారు. తేలికపాటి మారణాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి పోవడం వల్ల అంతర్జాతీయంగా శాంతి భద్రతలకు భంగం కలుగుతోందన్నారు. తక్షణమే సభ్యదేశాలు ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
''చిన్న, తేలికపాటి ఆయుధాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదు. సభ్యదేశాలు ఉగ్రవాదులను గుర్తించి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం పెను సవాలుగా మారింది. చిన్న ఆయుధాలు కావడం వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులువుగా తరలిస్తున్నారు.'' అని తెలిపారు
ప్రతి 12 మందిలో ఒకరు ఆయుధులే..
ఒక్క ఆఫ్రికాలోనే వంద మిలియన్ల మేరా చిన్న, తేలికపాటి ఆయుధాలు ఉన్నాయని అంచనా వేసింది. 1.2 బిలియన్ల జనాభా కలిగిన ఆఫ్రికాలో ప్రతి 12 మందిలో ఒకరి దగ్గర ఆయుధం కలిగి ఉన్నట్టు వ్లాదిమిర్ తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పటిష్టమైన చర్యలు లేకపోవడం వల్ల.. తీవ్రవాదులు, నేరస్థులు సునాయాసంగా ఆయుధాలను తరలిస్తున్నారని ఐరాస తెలిపింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సభ్యదేశాలు ముందుకు రావాలని ఐరాస ఉగ్రవాద నిరోధక శాఖ పిలుపునిచ్చింది. లిబియా నుంచి అక్రమ ఆయుధాలు చాడ్ సరస్సు బేసిన్ నుంచి ప్రపంచ దేశాలను సరఫరా అవుతున్నట్టు వివరించారు. గతేడాది నుండి యూఎన్ఓసీటీ, యూఎన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యూఎన్ఓ డీసీ) కౌంటర్-టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ (సీటీఈడీ), యూఎన్ ఆఫీస్ ఫర్ డిస్సామ్డ్ ఎఫైర్స్ ఏజెన్సీ(ఓడీఏ)లు సంయుక్తంగా వీటిపై నియంత్రణకు కృషి చేయనున్నాయని తెలిపారు. సభ్య దేశాల్లో ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి మా 'ఆల్-ఆఫ్-యుఎన్' ప్రాజెక్ట్ చేపట్టినట్టు తెలిపారు. ''ఈ ప్రాజెక్ట్ అమల్లో ఉన్న అన్ని మధ్య ఆసియా దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుందని నమ్ముతున్నాను. ఈ ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, సంపన్నంగా చేయాలి. అక్రమ ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి విముక్తి కలిగించడమే''నని తెలిపారు.