Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్: ఇరాన్ ,క్యూబా, వెనెజులా పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల కరోనా కట్టడిపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వైరస్ను అరికట్టేందుకు ఆయా దేశాలు గట్టి చర్యలు తీసుకునే అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షలతో అత్యవసర మందులు, వైద్య పరికరాలు, దిగుమతులు చేసుకోలేరు. స్వచ్ఛమైన నీరు కూడా ఇబ్బందే, దానితో పాటు వైద్య, ఆరోగ్యం కోసం ఉండాల్సిన మౌలిక సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. దాంతో వైరస్ వ్యాప్తిని దేశంలో అరికట్టేందుకు పరీక్ష జరిపే కిట్లు కూడా అందుబాటులో లేవు. ట్రంప్ ప్రభుత్వం ఏకపక్షంగా విధిస్తున్న ఆంక్షలు మానవ విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అంతర్జాతీయ చట్టాలను మొండిగా ఉల్లంఘించడం జరుగుతున్నది. అమెరికా అధ్యక్షుడికి ఈ అధికారాలు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాలచట్టం ద్వారా సంక్రమించింది. ఈ చట్టం అమానవీయంగా, చట్టవిరుద్ధమైనది. దీని ఫలితంగానే ఇరాన్లో కరోనా కల్లోలం తీవ్రంగా ఉన్నది. ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాలకు ఏమన్నా సహాయం చేయదలిస్తే.. ముందు ఏ దేశానికి హాని కల్పించ కూడదనే విధానాన్ని పాటించాలని అమెరికాలోని ఆర్థికవేత్తలు కోరుతున్నారు.