Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యమంత్రికీ ఇన్ఫెక్షన్
- వైద్య పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ
లండన్: కరోనా వైరస్‌కు వీఐపీలనే తేడాలేదనేలా బ్రిటన్‌లో కోవిడ్-19 సోకింది. మొన్న బ్రిటన్ రాణి ఎలిజిబెత్ సహాయకుడికి ..ఆ తర్వాత యువరాజు ప్రిన్స్ఛార్లెస్కు కరోనా వ్యాధి లక్షణాలు కనిపించటంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆ దేశ ఆరోగ్యమంత్రి మ్యాట్ హ్యాన్కాక్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బ్రిటన్ ప్రధానికి కరోనా సోకిందని గుర్తించిన కొద్ది గంటల్లోనే ఆరోగ్యమంత్రికి
కరోనా సోకటం తీవ్రంగా కలకలంరేపుతున్నది. తనకు కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. అందువల్ల తాను శుక్రవారం నుంచి స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్టు బోరిస్ ఒక ట్వీట్లో తెలిపారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాననీ.. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నానని వివరించారు. జాన్సన్‌కు గురువారం స్వల్పంగా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కన్పించటంతో ఆయనకు శుక్రవారం వైద్యులు పరీక్షలు నిర్వహించి వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు నిర్ధారించారని ప్రధాని నివాసం డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇంతకు ముందు తన సహాయకులకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకటంతో రాజభవనం వీడి బకింగ్‌హాం ప్యాలెస్‌కు మారిన రాణి ఎలిజెబెత్ ఈ నెల 11న తనను కలిసిన ప్రధానికి ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలు సూచించారని ఈ ప్రతినిధి వివరించారు. ప్రధాని జాన్సన్ అవసరమైతే తన బాధ్యతలను తాత్కాలికంగా విదేశాంగ మంత్రి డోమ్నిక్ రాబ్‌కు అప్పగిస్తారని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక కరోనా వ్యాధి లక్షణాలు స్వల్పంగా కనిపించటంతో స్వీయ నిర్బంధంలో ఉంటూ ఇంటినుంచే పనిచేస్తున్నట్టు ఆరోగ్యమంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ యూకేలో 11658 మందికి వైరస్ సోకగా..578 మంది చనిపోయారు...
సత్వరమే కోలుకోవాలి: ప్రధాని మోడీ ఆకాంక్ష
కరోనా వైరల్ ఇన్ఫెక్షన్కు గురైన బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ సత్వరమే కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షించారు. వైరల్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ కావటంతో తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్టు జాన్సన్ వెల్లడించటంపై స్పందించిన ప్రధాని మోడీ 'మీరు గొప్ప పోరాట యోధులు... ఈ సవాలును సత్వరమే అధిగమిస్తారు. మీరు సత్వరమే కోలుకోవాలని కోరుతూ దైవాన్ని ప్రార్థిస్తున్నాం. మీ సారథ్యంలో బ్రిటన్ సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా'నని ఒక ట్వీట్లో పేర్కొన్నారు.వవవవ