Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వెగటుపుట్టిస్తున్న ట్రంప్ ప్రకటనలు
న్యూయార్క్ : న్యూయార్క్ సిటీలో 25,000 కేసులు నమోదు అయినాయి. ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఏమీ చేయలేని స్థితి వచ్చింది. ఈ సమయంలో న్యూయార్క్‌లోని ప్రభుత్వం ఈ విధంగా ప్రకటన చేసింది. 'మీరు ఆస్పత్రుల్లో చేరి, మీకు వైద్య పరీక్ష చేస్తే నయం అవుతుందని తెలిస్తేనే వైద్య పరీక్షలకు పూనుకుంటాము' అని పేర్కొంది. ఎంత దారుణమైన ప్రకటన ఇది. ఈ పరిస్థితిలో ట్రంప్ ప్రకటన ఇంకా విడ్డూరంగా ఉన్నది. వెంటిలేటర్స్ కావాలని కోరితే ఆయన సమాధానం ఇలా ఉన్నది. '30,000 నుంచి 40,000 వెంటిలేటర్స్ కావాలని అంటున్నారు నేను దీన్ని నమ్మలేకపోతున్నాను'' దాని కొనసాగింపు ఆయన ఇలా అన్నారు ''మీరు ఒక పెద్ద ఆస్పత్రికి వెళ్తారు అక్కడ రెండు వెంటిలేటర్స్ ఉంటాయి. ఒకేసారి 30,000 నుంచి 40,000 కావాలంటే ఎలా'' అని ప్రశ్నించారు. ప్రపంచ అగ్రరాజ్యం అధినేత మాటలను గమనిస్తే మానవ జీవితాల రక్షణకు ఏర్పడిన దుస్థితి అర్థమవుతున్నది.