Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కోవిడ్..19 వైరస్ నియంత్రణకు వైద్యులు,నర్సుల బృందాలు
- ఇంటర్ ఫెరాన్ మందు కోసం 45 దేశాల నుంచి డిమాండ్
హవానా: క్యూబా డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనా వైరస్ను ఎదుర్కొనే వైద్య సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్న దక్షిణాఫ్రికా దేశాలకు, ఇటలీ, అర్జెంటీనా, వెనెజులా దేశాలకు పయనమైన్నారు. ఆ బృందంలోని ఒక నర్సు మాట్లాడుతూ '' మాకు తెలుసు ప్రస్తుత పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నదని అయినా ప్రజల ప్రాణాలను కాపాడటానికి క్లిష్ట పరిస్థితిని ఎదిరించి వెళ్ళుతున్నాం.'' ఇది క్యూబా వైద్య సిబ్బంది మనోనిబ్బరానికి ఒక ఉదాహరణ
కోవిడ్..19 వైద్య సేవలకు ప్రాణాలు తెగించి వెళ్తుంటే.. క్యూబాపై అమెరికా విమర్శలు చేస్తున్నది. వైద్య సహాయం వెనుక క్యూబా ఆర్థిక, రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నదనీ, తను పొగొట్టుకున్న డబ్బును పోగు చేసుకోవడానికే ఇదంతా అంటూ అమెరికా వాదనలపై చర్చ నడుస్తున్నది.
క్యూబా నుంచి పెద్ద సంఖ్యలో డాక్టర్లు అనేక దేశాల్లో కరోనా సోకిన రోగులకు సేవలందించటానికి సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే వెళ్ళి సహాయం అందిస్తున్న దేశాలు బెజ్లీ, ఆంటీగో, బెర్మూడ, సెయిట్విన్సెంట్, గ్రీడిన్, డొమినైస్, అర్జెంటీనా దేశాలున్నాయి. అమెరికా చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. క్యూబా విదేశాంగమంత్రి పారిల్లా మాట్లాడుతూ '' కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ప్రపంచ దేశాలకు సహాయహస్తం అందించేందుకు క్యూబా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా ఖండించడమంటే.. మానవ విలువలకు విరుద్ధమని అన్నారు. చట్ట విరుద్ధంగా క్యూబాపై ఆర్థిక ఆంక్షలుపెట్టి ఈ అత్యవసర సమయంలోనూ వేధించడం దారుణమని తెలిపారు. ప్రజల ప్రాణాలను వైరస్ కబళిస్తున్న వేళ అంతర్జాతీయ సంఘీభావం అత్యంత కీలకమన్నారు.
క్యూబాకు శాంతి.. ఆరోగ్యాన్ని రక్షించటమే లక్ష్యమనీ.. తమ వైద్యబృందాలు ప్రాణం నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసి..దేశం యావత్తూ గర్వపడుతున్నదన్నారు. మాదేశం నుంచి కాదు ఇతర దేశాల నుంచి సహాయం చేయడానికి వస్తున్న వైద్య సిబ్బంది మానవత్వంతో కూడిన ఈ సంఘీభావం కొనసాగించాలన్నారు.
క్యూబాలో ''ఇంటర్ ఫెరాన్'' అనే మందును 1980 నుంచి శ్వాసకోశ వ్యాధుల కోసం వాడుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లను నియంత్రించటానికి ఈ మందు చాల విజయవంతంగా పని చేస్తున్నది. ఇప్పుడు కరోనా వైరస్ కు కారణమైన శ్వాస సంబంధించిన ఆ మందును ఇవ్వాలంటూ 45 దేశాల నుంచి క్యూబాకు అభ్యర్థనలు వచ్చాయి. ఈ మందును క్యూబా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ జెనిటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ అనే సంస్థ తయారు చేస్తున్నది.