Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రతరం
పారిస్ : యూరప్, అమెరికా దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తొంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడింట రెండో వంతు ఈ దేశాల్లో ఉన్నాయి. మొత్తం దాదాపు 55 లక్షలకు పైగా కేసులు నిర్ధారణ కాగా, వాటిల్లో యూరప్ దేశాల్లో 20.5 లక్షలకు పైగా కేసులు రాగా, అమెరికాలో 16.9 లక్షల కేసులు తేలాయి. ఇక మరణాల సంఖ్యను చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 3,46,188 ఉండగా, వీటిల్లో యూరప్‌లో అధిక స్థాయిలో 1,72,824 మంది మరణించగా, అమెరికాలో ఆ సంఖ్య 98,223గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నిర్ధారణ అయిన కేసులు ఒక్క నెలలోనే రెట్టింపు అయ్యాయి. గత 11 రోజుల్లోనే దాదాపు 10 లక్షల మేర కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా వైరస్ నిర్ధారణ అయిన కేసుల్లో వాస్తవానికి కొంత సంఖ్యను మాత్రమే ప్రతిబంబిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చాలా దేశాల్లో తీవ్ర కేసులను మాత్రమే పరీక్షిస్తున్నాయి. తగిన పరీక్షా పరికరాల సామర్ధ్యం లేకపోవడం కారణంగా ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించలేకపోతున్నాయి. దీని కారణంగా ఇప్పటి వరకూ ఖచ్చితంగా ఎంత మందికి ఈ వైరస్ సోకిందన్న దానిపై ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.