Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాన్సన్ సలహాదారుడి తీరుపై అసహనం
లండన్ : కరోనా లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాన సలహాదారుడు డొమినిక్ కమ్మింగ్స్ తీరుపై వివాదం కొనసాగుతోంది. ఆయన వైఖరిని ఖండిస్తూ జాన్సన్ ప్రభుత్వంలోని మంత్రి ఒకరు మంగళవారం రాజీనామా చేశారు. తన చర్యలపై సలహాదారు సోమవారం వివరణ ఇచ్చినా కూడా తాజా రాజీనామా చోటుచేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలను అనుగుణంగా ఇళ్లలోనే ఉండాలని స్కాట్లాండ్కు చెందిన మంత్రి డగ్గస్ రాస్ లక్షలాది మంది ప్రజలను కోరారు. అయితే లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తూ డొమినిక్ కమ్మింగ్స్ మార్చి నెలాఖరులో లండన్ నుంచి దాదాపు 260 మైళ్ల మేర ప్రయాణించి ఈశాన్య ఇంగ్లాండ్‌లోని డుహ్రాంకు వెళ్లారు. 'కమ్మింగ్స్కు ఉన్న పరిస్థితులపై నేను బహరంగంగా మాట్లాడలేను. మరిన్ని వివరాల కోసం వేచిచూస్తున్నా. తన చర్యలపై వివరణ ఇస్తూ ప్రకటన కమ్మింగ్ ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తూన్నా. అయితే ఆ ప్రకటనలోని అంశాలు నాకు కొంత ఇబ్బందిగా ఉన్నాయి. అందుకే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను' అని రాస్ పేర్కొన్నారు. 'ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ ప్రియమైన వారి అంత్యక్రియల్లో పాల్గొనలేదని వారు, కుటుంబసభ్యులను కలుసుకోలేదని వారు ఎందరో ఉన్నారు.. ఇలాంటి సమయంలో వారందరిదీ తప్పు, నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వ సలహదారుడిది ఒప్పు అని నేను చెప్పలేను' అని తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.