Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిష్కారాలు కోరుతున్న యూఎన్‌హెచ్‌సీఆర్
నైరోబీ : తూర్పు ఆఫ్రికాలో పట్టణ శరణార్థుల సమస్యకు ఐరాస శరణార్థుల సంస్థ యూఎన్‌హెచ్‌సీఆర్ పరిష్కారా మార్గాలను కోరుతోంది. ఈ సమస్య పరిష్కారానికి భాగస్వామ్యులతోనూ, ప్రభుత్వాలతోనూ సన్నిహితంగా పని చేస్తానని తెలిపింది. ఆఫ్రికాలోని తూర్పు, హార్న్, గ్రేట్ లేక్స్ల్లో కోవిడ్-19 ఆర్థిక ప్రభావం తీవ్రంగా ఉండటంతో పట్టణ శరణార్థులు మనుగడ కోసం కష్టపడుతున్నారని యూఎన్‌హెచ్‌సీఆర్ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ప్రాణాలను రక్షించే కార్యక్రమం కోసం సుమారు 126 మిలియన్ల డాలర్లను సంస్థ అభ్యర్థించింది. పట్టణ శరణార్థులకు మద్దతు ఇవ్వకపోతే వారు తీవ్రమైన దోపిడీకి గురికావడం, లేదా అప్పులు, సెక్స్, బాలకార్మికులు వంటి పరిస్థితుల్లోకి నెట్టబడతారని ఆవేదన వ్యక్తం చేసింది. పట్టణ శరణార్థులు ఎక్కువ శాతం అపరిశుభ్రత వాతావరణంలో జీవిస్తున్నారనీ, వైరస్ వ్యాప్తికి గురవుతున్నారని తెలిపింది.